కాకినాడలో వంచనపై గర్జన...


ఏపీకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం..
వైయస్‌ఆర్‌సీపీ నేతలు..

కాకినాడః విభజన వల్ల అన్ని రకాలుగా అన్యాయమైపోయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలోని హామీలు అమలు చేయించుకోవడంలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యం, కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వేదికగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వంచనపై గర్జన నిరనస కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభమవుతోంది. సాయంత్రం నాలుగు గంటలు వరుకు దీక్ష కొనసాగుతుంది. దీక్షల్లో వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు,వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ కోఆర్డీనేటర్లు, నేతలు పాల్గొనున్నారు. నల్ల దుస్తులతో దీక్షకు వైయస్‌ఆర్‌సీసీ శ్రేణులు హాజరుకానున్నారు.సభ ప్రాంగణం వద్దకు ఇప్పటికే పార్టీ శ్రేణులు, ప్రజలు అధికసంఖ్యలో చేరుకున్నారు.

ప్రత్యేకహోదా సాధించడంలో చంద్రబాబు విఫలంః వైయస్‌ఆర్‌సీపీ నేతలు..

ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నా  ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలు అన్నారు.ధర్మపోరాట దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.దీక్షలు కూడా ప్రభుత్వ సొమ్ముతో చేయడం సిగ్గుచేటన్నారు.ఏపీకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. ప్రత్యేకహోదాను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలయ్యారన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 25 సార్లు పోరాటం చేశారన్నారు.పార్టీల కతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Back to Top