వైయస్‌ పథకాలను అమలుచేసే సత్తా జగన్‌కే ఉంది

హైదరాబాద్‌, 11 డిసెంబర్‌ 2012: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసే సత్తా శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికే ఉందని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తేనేటి వనిత అన్నాను. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను ఆమె మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు వెళ్ళి కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ధీమాతోనే తాను పార్టీలో చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిఎంగా చేసే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో డబ్బుకే  ప్రాధాన్యమన్నారు. ఎఫ్‌డిఐ ఓటింగ్‌పై  యుపిఎకు అనుకూలంగా  వ్యవహరించిన ముగ్గురు ఎంపిలపై  చర్యలు ఎందుకు తీసుకోలేదని చంద్రబాబును ఆమె నిలదీశారు. ఎమ్మెల్యే వనితతో పాటు వైయస్‌ఆర్‌సిపి నాయకుడు భూమా నాగిరెడ్డి కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.

తాజా ఫోటోలు

Back to Top