వైయస్ ఆశయ సాధనకు కృషి చేయాలి

కడప:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నగర కన్వీనర్‌గా పెనుబాల చంద్రయ్యకు గురువారం పార్టీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబుతో కలిసి ఆయన నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వైయస్ ఆశయాలను, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రస్తుత ప్రభుత్వంలో నిర్వీర్యమవుతున్న తీరును వివరించాలన్నారు. అనంతరం చంద్రయ్య మాట్లాడుతూ తనపై నమ్మకముంచి పదవి ఇచ్చిన పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ పులి సునీల్‌కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

Back to Top