వైయస్‌ఆర్‌సిపిపై దాడులు చేస్తే తస్మాత్‌ : జిట్టా

హైదరాబాద్‌, 29 డిసెంబర్‌ 2012: తెలంగాణ ఉద్యమం నెపంతో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ జేబు సంస్థలు కొన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులపై దాడులకు ప్రయత్నిస్తున్నాయని వైయస్‌ఆర్‌ సిపి రీజినల్‌ కో ఆర్డినేటర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులపై అకారణంగా ఎవరైనా దాడి చేస్తే సహించేది లేదని ఆయన శనివారం ఇక్కడ హెచ్చరించారు.

ఉస్మానియా జెఎసి ముసుగులో కేసీఆర్ జేబు సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు కొందరు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. నిజంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీవారే వస్తే వారిని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చర్చలకు ఆహ్వానిస్తుందని అన్నారు.
Back to Top