బంగారంపై రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు నోటీసులు వచ్చిన విషయం.... ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పడం అత్యంత దారుణమైన విషయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ... మహిళలకు బ్యాంకుల నుంచి నోటీసులు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు ఈ విషయమై మంత్రిని కలిసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు.<br/>ప్రతి వివాహిత మహిళ తన మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుందని, అవసరం కొద్దీ మంగళసూత్రాన్ని బ్యాంకులో తనఖా పెడుతుందన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు మహిళలను నమ్మించి మోసగించారని కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు సర్కార్ బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తారని మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.