ప.గో.లో నేడు, రేపు 'వైయస్ఆర్' జనభేరి

హైదరాబాద్:

నేడు, రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి  పర్యటిస్తారు. ఈ రెండు రోజులు ఆ జిల్లాలో 'వైయస్ఆర్‌ జనభేరి' నిర్వహిస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ వైయస్ జగ‌న్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏలూరు వరకు రోడ్ షో నిర్వహిస్తా‌రని తలశిల, తెల్లం తెలిపారు. మధ్యాహ్నం 3.30కి ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో వైయస్ఆర్ జనభేరి బహిరంగ సభలో పాల్గొంటా‌రని పేర్కొన్నారు. 4వ తేదీ మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రోడ్‌షో చేస్తారన్నారు. అదే రోజు మధ్యాహ్నం 3.30కి నిడదవోలు గణేష్ చౌ‌క్‌లో వైయస్ఆర్ జనభేరి బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి జిల్లాలోనే బస చేసి మరుసటి రోజు‌ బుధవారం ఉదయం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళతారని తలశిల రఘురాం, తెల్లం బాలరాజు వివరించారు.

Back to Top