తిరుపతి డ్రైనేజీ వ్యవస్థపై భూమా ఆవేదన

తిరుపతి, 3 అక్టోబర్‌ 2012: తిరుపతి నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైందని వైయస్‌ఆర్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న వర్షాలకే నగరంలోని మురుగునీటి కాల్వలు పొంగిపోయి రోడ్లపైనే పారుతున్నాయని ఆయన తెలిపారు. ‌తిరుపతి మురికివాడల్లో ఎమ్మెల్యే భూమన బుధవారం పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా వారి నుంచే అడిగి తెలసుకున్నారు. డ్రైనేజి వ్యవస్థ తీరుపైన ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, డ్రైనేజి వ్యవస్థ దారుణంగా మారిపోయింనందు వల్లే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తిరుపతిలో మూడు వేల మంది డెంగీ బాధితులున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని భూమన డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top