టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి

కంబదూరు:వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోవిస్త్రృతంగా చేపట్టి టీడీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌.... నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని కన్యాకపరమేశ్వరి దేవాలయంలో జరిగిన వైయస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి శంకరప్ప తల్లి నీలి అంజనమ్మ సంస్మరణ సభకు ఆమె హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. తరువాత  బూత్‌కమిటీ సభ్యులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్బంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టుతున్న కార్యక్రమాలపై చర్చించారు. నవంబర్‌ 2వ తేది నుంచి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని మె వివరించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన 9 నవరత్నాలతో పాటు పాదయాత్రలో మరిన్ని పథకాల ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సింగి ల్‌విండో అధ్యక్షులు బాబురెడ్డి,ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసప్ప,నాయకులు వసంతరాయుడు,శివలింగప్ప,నాగభూషణ,బీమరాయుడు,మల్లురి వెంకటేశులు,హోటల్‌ రాము,వీ,వెంకటేశులు,యువజన నాయకులు బీమేష్,విల్సన్,క్రాంతి,లోకేష్,రాజు,వన్నూరప్ప,నాగేంద్ర,హనుమంతరాయుడు,ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Back to Top