మహబూబ్‌నగర్‌లో ఘనంగా ఆవిర్భవ వేడుకలు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఎందరో అమరవీరుల త్యాగఫలితమే నేడు తెలంగాణ ఏర్పాటుకు కారణమన్నారు. అలాంటి తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని, కేసీఆర్‌ తన మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top