తణుకులో షర్మిల బహిరంగ సభ

ఇరగవరం, 31మే2013:

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం సాయంత్రం శ్రీమతి షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం శుక్రవారం నాటికి 165వ రోజుకు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి శుక్రవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర సాగుతుంది. గోటేరు క్రాస్‌ రోడ్ , గోపాలపురం, తణుకు ఇరగవరం ఎస్సీ కాలనీ, ఆర్పీ రోడ్, తణకు జెడ్పీ హైస్కూల్ మీదుగా వెంకటేశ్వరా థియేటర్ రోడ్డు వరకు యాత్ర కొనసాగుతుంది. రాత్రికి వెంకటేశ్వరా థియేటర్ రోడ్ వద్ద బస చేయనున్నారు. ఇవాళ మొత్తం 12.2కి.మీ మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.

తాజా ఫోటోలు

Back to Top