స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకోండి

హైదరాబాద్, 8 జూన్‌ 2013:

  స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ ‌నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో‌ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రతి ప్రజా సమస్యపైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని పార్టీ నాయకులకు ఆమె సూచించారు.

 స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌సంసిద్ధం అవుతున్న నేపథ్యంలో శ్రీమతి వైయస్ విజయమ్మ శనివారం ఆం‌ధ్ర ప్రాంత ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, జిల్లా కన్వీనర్లు, పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆది, సోమవారాల్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంత నాయకులతో కూడా శ్రీమతి విజయమ్మ సమీక్ష నిర్వహిస్తారు.

Back to Top