రాష్ట్ర‌వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష‌లు ప్రారంభం


అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీ చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అన్ని ప్రాంతాల్లో ఈ దీక్షలు కొన‌సాగుతున్నాయి. విజ‌య‌న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు యడ్ల రమణమూర్తి ప్రారంభించారు. వైయ‌స్ఆర్‌ కడప జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ నసీబున ఖనమ్‌, కౌన్సిలర్లు దీక్షలు చేపట్టారు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజ‌య్య ఆధ్వ‌ర్యంలో, శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మకూరు ప‌ట్ట‌ణంలో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, క‌ర్నూలులో హాఫీజ్‌ఖాన్ ఆధ్వ‌ర్యంలో, ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి, మంత్రాల‌యంలో ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో రిలేదీక్ష‌లు ప్రారంభించారు. అనంత‌పురం జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో రిలే దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో దీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నెల్లూరులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి, విజ‌య్‌కుమార్‌రెడ్డిలు రిలే దీక్ష‌లు చేప‌ట్టారు. ప్ర‌కాశం జిల్లాలో బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌, జంకే వెంక‌ట్‌రెడ్డిల ఆధ్వ‌ర్యంలో దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో అంబ‌టి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, కోన ర‌ఘుప‌తి, ముస్త‌ఫా త‌దితరులు రిలే దీక్ష‌లు ప్రారంభించారు. తూర్పు గోదావ‌రి, విశాఖ‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రిలే దీక్ష‌లు మొద‌ల‌య్యాయి.
Back to Top