‌కర్నూలు నుంచి రేపు జగన్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని కర్నూలు నుంచి పునః ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలో షర్మిల ప్రచారం :
శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఈ నెల 13 నుంచి తెలంగాణ ప్రాంతంలో పర్యటించి పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

గుంటూరు జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన :
వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించారు. ఆమె శనివారంనాడు తెనాలి శాసనసభా నియోజకవర్గంలోని కొలకలూరు, గుడివాడ, కోపల్లి, అంగలకుదురు, వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, ఎడ్లపల్లి, ఒలివేరు, చుండూరు, మోదుకూరు, మోపర్రు, తురిమెళ్ల, అమృతలూరు, గోవాడ, ఎలవర్రు, ఇంటూరు, బాపట్ల నియోజకవర్గంలోని చందోలిల్లో పర్యటిస్తారని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురా‌మ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Back to Top