ఖమ్మంలో నేడు జగన్ ‘వైయస్‌ఆర్ జనభేరి’

ఖమ్మం:

సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేడు ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలో ‘వైయస్‌ఆర్ జనభేరి’ సభ నిర్వహి‌స్తారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి ఆయన సత్తుపల్లి మండలం గంగారం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తారు. సత్తుపల్లి, వైరా మీదుగా ఖమ్మం వరకు ఆయన పర్యటన కొనసాగుతుంది.

ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగిస్తారు. తెలంగాణలో తొలిసభ కావడంతో పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Back to Top