బొబ్బిలిలో నేడు షర్మిల బహిరంగ సభ

రొంపల్లి (విజయనగరం జిల్లా),

18 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 213వ రోజు గురువారం కొనసాగే వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ పె‌న్మెత్స సాంబశివరాజు ప్రకటించారు. శ్రీమతి షర్మిల గురువారం ఉదయం మరో ప్రజాప్రస్థానాన్ని రొంపల్లి జంక్షన్‌ నుంచి ప్రారంభించారు. రొంపల్లి నుంచి పారాది, సీతారాంపురం మీదుగా మెట్టవలస వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ మధ్యాహ్నానికి శ్రీమతి షర్మిల విరామం తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆమె బొబ్బిలిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని రఘురాం, సాంబశివరాజు వివరించారు.

బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల బొబ్బిలి ప్రభుత్వాసుపత్రి రోడ్డు, లచ్చయ్యపేట వరకూ పాదయాత్ర చేస్తారు. లచ్చయ్యపేటలో గురువారం రాత్రికి బస చేస్తారు. కాగా, శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 213వ రోజుకు చేరుకుంది. విజయనగరం జిల్లాలో ఆమె పాదయాత్ర పదకొండవ రోజుకు చేరింది. ఈ రోజు మొత్తం ఆమె 15.3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని రఘురాం, సాంబశివరాజు వెల్లడించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top