అలమండలో ముగిసిన 204వ రోజు పాదయాత్ర

అలమండ, (విజయనగరం జిల్లా),

9 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం 204వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ విజయగనం జిల్లా అలమండ వద్ద ముగిసింది. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస దగ్గర మంగళవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. 204వ రోజు పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల మామిడితాండ్ర (మేంగో జెల్లీ) తయారీదారులను కలుసుకున్నారు. వారి సమస్యలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. తమ కష్టం దళారుల పాలవుతోందని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిలకు మామిడితాండ్ర తయారీలో పాల్గొనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు తెచ్చుకుని పెట్టుబడులు పెడితే, అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. వారి కష్టాలు విన్న శ్రీమతి షర్మిల రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని సూచించారు. కాగా, ఈ రోజు శ్రీమతి షర్మిల 15 కిలోమీటర్లు నడిచారు. మంగళవారంనాటి పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసే సమయానికి ఆమె మొత్తం 2,717.7 కిలోమీటర్లు నడిచారు.

Back to Top