యువభేరికి తరలి రావాలి

ఉంగుటూరు: ఏపికి ప్రత్యేక హోదా కోసం యువభేరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వైయస్సార్‌ కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షులు వింత శంకరరెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు నల్లపాడు వద్ద జరిగే యువభేరి కార్య్రక్రమంనకు యువత తరిలిరావటానికి  సిద్దంగా ఉండాలని చెప్పారు. ప్రత్యేక హోద ఆంధ్రుల హక్కుఅనే  పోరాటంతో సాధించుటకు యువత సిద్దంగా ఉంన్నారని చెప్పారు. అపరాల సాగు చేసిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాని డిమాండ్‌ చేసారు.  అంతుచిక్కని తెగుళ్ళతో అపరాల సాగు చేసిన రైతన్న తీవ్రంగా నష్టం పోయాడని వివరించారు. మండలంలో 27 వేల ఎకరాలలో మినుము పంట సాగు చేసినా 60 శాతం నష్టాల భారిన పడినట్లు అధికారులు అంచనాలు వేసారని చెప్పారు. చిత్త శుద్ది ఉంటే నష్ట సోయిన రైతుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top