వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా భూమయ్యగారిపల్లెకు చేరుకున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్థానిక భక్తులతో కలిసి దర్శన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించనున్నారు. క్రీడాకారులను, నిర్వాహకులను ఆయన అభినందించనున్నారు. ఆ తర్వాత వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.