షర్మిలకు అడుగడుగునా అపూర్వ స్వాగతం

పాలకొల్లు (ప.గో.జిల్లా),

29 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం 163వ రోజు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. మహానేత తనయ శ్రీమతి షర్మిలకు పాలకొల్లు నియోజకవర్గంలో అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది.

పాలకొల్లు మార్కెట్ యార్డు నుంచి‌ బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్, బ్రా‌డీపేటలలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు‌లు అర్పించారు. అక్కడి నుంచి జిన్నూరు, వేడంగి మీదుగా కవిటం వరకు శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంది.

కాగా, మహానేత రాజన్న బిడ్డను సమీపం నుంచే చూడాలని, ఆమెతో కరచాలనం చేయాలని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు పోటీపడ్డారు. శ్రీమతి షర్మిల పాదయాత్రలో ప్రజలు కూడా కదం తొక్కుతున్నారు.

Back to Top