ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శయాత్ర..!

రాజన్న బిడ్డను చూసేందుకు బారులు తీరిన జనం..! 
మూడ్రోజుల పాటు 10 కుటుంబాలకు పరామర్శ..!

ఆదిలాబాద్ః దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలో ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శయాత్ర ప్రారంభమైంది. కరీంనగర్ పర్యటన ముగిసిన అనంతరం మంచిర్యాల మీదుగా షర్మిల ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించి...మొత్తం ఆరు నియోజకవర్గాల్లో 10 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు.  

అదే ఆదరణ..అదే ఆప్యాయత..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని బాధిత కుటుంబసభ్యులకు  భరోసా కల్పిస్తున్నారు. షర్మిలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నారు. 

రాజన్న ఆశయాల కోసం కష్టపడుదాం..!
ఫీజు రీయింబర్స్ మెంట్ , 108, ఆరోగ్యశ్రీ, ఉచితవిద్యుత్, పావలా వడ్డీలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని షర్మిల పేర్కొన్నారు. ఆయన బతికుంటే ప్రతి పేదవాడి ఇళ్లు కళకళలాడేదని, రైతులంతా సంతోషంగా ఉండేవారని షర్మిల ఈసందర్భంగా గుర్తుచేశారు. మనిషి మనిషిని మనిషిలా గౌరవించిన గొప్ప మహనీయుడు వైఎస్ . రాజశేఖర్ రెడ్డి . ఆయన ఆశయాలను సాధించుకునేందుకు అందరం చేయి చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. 
Back to Top