194వ రోజు షర్మిల పాదయాత్ర పారంభం

చోడవరం 29 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె శ్రీమతి షర్మిల విశాఖ జిల్లాలోని ఎల్.సింగారం నుంచి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. వడ్డాది, విజయరామరాజు పేట, లక్ష్మీపురం, చోడవరం జంక్షన్ మీదగా ఆమె పాదయాత్ర సాగనుంది. శనివారంతో షర్మిల చేపట్టిన పాదయాత్ర 194వ రోజుకు చేరుకొంది. శనివారంనాటి పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు తెలిపారు. వడ్డాది మీదుగాసాగి విజయరామరాజుపేట సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. లక్ష్మీపురం మీదుగా చోడవరం చేరుకుంటారు. చోడవరం జంక్షన్‌లో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Back to Top