సీఎం ప్రకటన కంటితుడుపు చర్యే: నల్లపరెడ్డి

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

కరెంట్‌ ఛార్జీలపై ముఖ్యమంత్రి ప్రకటన కంటితుడుపు చర్యని వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్‌కు గ్రామాల్లో ప్రజల సమస్యలు పట్టవని.. ఆయన కేంద్రం దిగుమతి చేసుకున్న వస్తువని విమర్శించారు. దీక్ష చేస్తున్న తమ ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్ట్ చేస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఆరోగ్యం క్షీణించిందని.. అయినా ప్రజల కోసం ప్రాణాలర్పించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని నల్లపరెడ్డి ప్రకటించారు.

Back to Top