`సేవ్ అవ‌ర్ ఏపీ` మొబైల్ అప్లికేష‌న్ విడుదల

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఐటీ ‌విభాగం `సేవ్‌ అవర్‌ ఏపీ` పేరుతో కొత్త ఆండ్రాయిడ్‌ మొబైల్ అప్లికేష‌న్‌ను రూపొందించింది. ఈ మొబైల్ అప్లికేష‌న్‌ను వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు.

ఈ అప్లికేషన్‌తో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపేందుకు ‌వీలవుతుందని పార్ట ఐటి విభాగం ప్రతినిధులు వివరించారు. ఈ అప్లికేషన్‌ను పొందాలంటే గూగుల్ ప్లేస్టో‌ర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చ‌ని వారు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top