ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే సభకు దూరం

ఫిరాయింపుదాలరుపై వేటుపడితేనే అసెంబ్లీకి 
రాష్ట్రంలో పరిణామాలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌కు వైయస్‌ జగన్‌ లేఖ
ప్రజా సంకల్పయాత్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబు
రఘువీరారెడ్డి మాటలు అత్యంత దుర్మార్గం
రావణాసురుడిలా బాబుకు ప్రతి పార్టీలో ఒక తలకాయ
ప్రజలను తప్పుదోవపట్టించే వారిని అడ్డుకునే సమయం ఆసన్నమైంది
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశాలనుబాయ్కాట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి తప్పు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి వస్తామని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా అభిప్రాయం తెలియజేశారని చెప్పారు. ఈ మేరకు పార్టీ తీర్మానం చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిపై వైయస్‌ జగన్‌ లేఖ రాసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌కు పంపించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణను విస్మరించి ఏరకంగా ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారనే అంశంపై ఎమ్మెల్యేలంతా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగిందన్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవడం దేశ వ్యాప్తంగా రాకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు. అందుకనే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామన్నారు.
 
వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టగానే చంద్రబాబు పార్టీ కుట్రలు పన్నుతోందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఓదార్పు యాత్ర చేపట్టిన సమయంలో వైయస్‌ జగన్‌ ఎక్కడ పెద్ద నాయకుడిగా ఎదుగుతాడోనని చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి కుట్రలు చేశారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిని బలవంతంగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు పంపిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ నుంచి రఘువీరారెడ్డిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సమావేశాలు బహిష్కరిస్తే దానిపై మాట్లాడకుండా పద్దతి కాదని మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయకుండా ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.  

రావణాసురుడికి పది తలలు ఉన్నట్లు చంద్రబాబు ప్రతి పార్టీ ఒక తలకాయ ఉంటుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీలో చంద్రబాబుకు మద్దతు తెలిపే పెద్ద తలకాయ ఎవరో అందరికీ తెలుసనీ, అదే మాదిరిగా కాంగ్రెస్‌లో పెద్ద తలకాయతో చర్చలు జరిపి ఏ విధంగా కేసుల్లో ఇరికించారో ప్రజలకు తెలుసన్నారు. ప్రతి రోజు టీవీ ఛానల్స్‌లోకి వచ్చి మేధావులం, విశ్లేషకులం అని చెప్పుకుంటూ వంటినిండా చంద్రబాబు పార్టీ రంగు పులుముకొని ఆ పార్టీకి భజనం చేయడం మంచి పరిణామమా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే వారి ఆలోచనలు అడ్డుకునే సమయం ఆసన్నమైందన్నారు. వాస్తవాలు, ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడేవారిని మాత్రమే ప్రోత్సహించాలన్నారు. 

జననేత వైయస్‌ జగన్‌ పాదయాత్రకు పర్మిషన్‌ రావద్దని చంద్రబాబు కుట్రలు పన్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామనే మాటలు మాట్లాడకుండా ఏదోరకంగా అడ్డంకులు సృష్టించాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. అంటే చంద్రబాబు ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారో ప్రజలకు అర్థం అవుతుందన్నారు. 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు లాక్కున్నారని, వారిపై వేటుపడితేనే అసెంబ్లీకి హాజరవుతామని చెప్పామన్నారు. శాసనసభ బులిటెన్‌లో పార్టీ ఫిరాయించిన వారు, మంత్రి పదవులు చేపట్టినవారు కూడా వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్నట్లు చూపించడం సమంజసం కాదన్నారు. అంటే మా పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా జరిగాయన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 270 రోజులకుపైగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే... చంద్రబాబు అధికారం చేపట్టి 4 ఏళ్లు గడుస్తున్నా కనీసం 75 రోజులు కూడా జరగలేదన్నారు. ఇవి కాక పార్టీ ఫిరాయించిన వారిని విచ్చలవిడిగా ప్రోత్సహించడం, విప్‌ ఇస్తే దాన్ని అంగీకరించకుండా స్పీకరే అడ్డుకోవడం, శాసనసభ మంత్రి క్లాజ్‌లను తొలగించడం, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రశ్నించిన మహిళా సభ్యురాలిని ఏ విధంగా సస్పెండ్‌ చేశారో.. అందరికీ తెలుసన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top