సామినేని ఉదయభాను అరెస్టు

విజయవాడ: శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభానుతో పాటు పలువురు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అర్హులకు రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలంటూ వైయస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జ‌గ్గాయ‌పేట త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద‌ ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సామినేని ఉదయభాను సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top