సబిత, ధర్మానను ఎందుకు అరెస్టు చేయరు?

శాయంపేట (వరంగల్‌ జిల్లా) : దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదలైన ‌జిఓలన్నీ ఆయనే విడుదల చేశారా.. లేక కేబినెట్ ఆమోదంతో విడుదలయ్యాయా.. లేదా అప్పటి మంత్రులు విడుదల చేశారా? అనే‌ది ప్రజల ముందుకు తేవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మంత్రుల మధ్యే సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారంలో సిబిఐ చార్జిషీటు దాఖలైనప్పటికీ వారిని అరె‌స్టు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు.‌ వరంగల్ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదివారం సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.

సెంట్ర‌ల్ బ్యూరో ఆ‌ఫ్ ఇన్వెస్టిగేష‌న్‌ (సిబిఐ) కాస్తా కాంగ్రెస్ బ్యూరో‌ ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌గా మారిందని సురేఖ ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నాయకులపై కాంగ్రెస్.. ‌సిబిఐ అస్త్రాన్ని ప్రయోగిస్తూ దారికి తెచ్చుకుంటోందని ఆమె ఆరోపించారు. చార్జిషీట్ల పేరుతో జైలు నుంచి శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకోవాలని చూస్తోందని సురేఖ విమర్శించారు.
Back to Top