పాలకొండను నీటి సమస్యనుంచి గట్టెక్కించండి

అసెంబ్లీః పాలకొండలో గిరిజన ప్రజానీకం తాగునీటి సమస్యతో అల్లాడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కళావతి అసెంబ్లీలో తన నియోజకవర్గ సమస్యలను ఏకరవు పెట్టారు. రెండేళ్లుగా అడుగుతున్న ప్రతిసారి నిధులు లేవని తప్పించుకుంటున్నారని ప్రభుత్వ తప్పిదాల్ని ఎత్తిచూపారు. మంచినీటి సమస్య నుంచి నియోజకవర్గ ప్రజలను గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వాగులు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉందని కళావతి వాపోయారు. స్పెషల్ ఫండ్స్ ఉన్నాయని కలెక్టర్ చెప్పినప్పటికీ .... అది కార్యరూపం దాల్చాలంటే సమయం పడుతుందన్నారు. ఈలోగా ట్యాంకర్ల ద్వారా గానీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా గానీ నీటిని ఇచ్చే విధంగా ఆలోచన చేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తోటి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. 
Back to Top