ఇంటింటికి నవరత్నాలు..

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రావాలి జగన్‌–కావాలి జగన్‌
కర్నూలు జిల్లా  పత్తికొండ నియోజకవర్గం చెన్నపల్లిలో ఇన్‌చార్జ్‌ చెరుకులపల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. నవరత్నాల కరపత్రాలను ఇంటింటికి పంచి ప్రయోజనాలు వివరించారు. ఈ  సందర్భంగా కెపీ గూడెం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ ఆధ్వర్యంలో వేపగుంట, ముత్యగుంట కాలనీ,గంగిరెద్దుల కాలనీ,బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి నవరత్నాలపై వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు టీడీపీ నేతల ఆగడాలను వైయస్‌ఆర్‌సీపీ నేతలకు వివరించారు. పక్షపాత వైఖరీ అవలంభిస్తూ కనీస సౌకర్యాలు కూడా అందించడంలేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా రాజంపేటలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరత్నాల పథకాల ఫలితాలను ప్రజలకు వివరించారు.
Back to Top