విశాఖ ఈనాడు స్థల వివాదం కేసు విశాఖపట్నం, 29 ఆగస్టు 2012 : విశాఖపట్నం సీతమ్మధారలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని రెంట్ కంట్రోల్ కోర్టు బుధవారంనాడు ఆ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావును ఆదేశించింది. కార్యాలయాన్ని మూడు నెలల్లో ఖాళీ చేయడంతో పాటు స్థలం యజమాని కుమార్‌వర్మకు పాత బకాయిలు కూడా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా గతంలో రామోజీరావుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. లీజు గడువు ముగిసినప్పటికీ తమ ఆస్తిని తిరిగి అప్పగించేందుకు నిరాకరించటమే కాకుండా తమకు తెలియకుండా కొంత భూమిని రహదారి విస్తరణకు ఇచ్చి, ప్రతిఫలంగా వచ్చిన స్థలాన్ని రామోజీరావు ఆయన పేర రిజిస్టరు చేసుకుని తనను మోసగించారని కుమార్‌వర్మ ఛీటింగ్ కేసు దాఖలు చేసిన విషయం విదితమే.