మూల‌ప‌ల్లిక్రాస్ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం చిత్తూరు : ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర  విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 48వ రోజు ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా మూలపల్లిక్రాస్‌ నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి యాత్ర ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లె, రేణుమాకులపల్లి క్రాస్‌, మీదుగా తిమ్మయ్యగారిపల్లి చేరుకుంటుంది. ఆపై పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్‌ మీదుగా ముదివేడు వరకు చేరుకుని అక్కడ ముగుస్తుంది.  పాదయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ కన్నెమడుగు, దాదంవారిపల్లో, ముదివేడుల్లో దివంగత నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఎద్దులవారిపల్లె, రేణుమాకులపల్లె క్రాస్‌, పరదేశీపల్లెక్రాస్‌, తూపల్లిక్రాస్‌లో ఆయన జనంతో మమేకం కానున్నారు.
Back to Top