ప్రజల్ని ప్రభావితం చేస్తాడనే అరెస్టు: విజయమ్మ


ఎస్‌కే యూనివర్సిటీ:

ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి డాక్టర్ వైయస్ఆర్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. ఆదివారం రాత్రి ఏడు గంటలకు ఎస్ కే యూనివర్శిటీలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. రైతుల ఇబ్బందులను ఆయన గమనించారనీ, వృద్ధులకు పింఛన్లు ఇచ్చారని తెలిపారు. పింఛన్ల గురించి వైయస్ ఓరోజు ఇంట్లో  చెబుతూ వైయస్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారని తెలిపారు.  ప్రజల కష్ట సుఖాలు తెలిసిన మనిషి కాబట్టే సీఎం అయిన వెంటనే ఉచిత విద్యుత్తు ఇచ్చారన్నారు. రైతన్న రుణాలు రద్దు చేశారని తెలిపారు. ఎవరికి ఏం కావాలో వైయస్ కు తెలుసునని విజయమ్మ పేర్కొన్నారు. తిండికి లేకపోయిన నోరు తెరిచి అడిగే మనస్తత్వం ప్రజలకు లేదని ఆయన గుర్తించారని చెప్పారు. కులాలు మతాలకతీతంగా అన్ని పథకాలు అందేలా ఆయన ఆలోచించారని ఆమె చెప్పారు. పింఛన్లు, ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ, ఇలా ఎన్నో పథకాలు పెట్టారన్నారు. అన్ని విషయాల్లో ఆయన ప్రజల గురించే ఆలోచించారు. జగన్ బాబు ఆ మహానేత బిడ్డగా ప్రజల మధ్యలో ఉన్నరనీ, ఓదార్పు యాత్ర చేపడుతూ అన్ని సమస్యలపై స్పందించారనీ విజయమ్మ గుర్తుచేశారు. హైదరాబాద్ లో ఫీజు దీక్ష, ఢిల్లీలో జల దీక్ష, ఇలా దీక్షలు చేపట్టి ప్రజల మధ్యలో ఉన్న విషయాన్ని కూడా ఆమె జ్ఞప్తికి తెచ్చారు.  కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి జగన్ పై కేసులు పెట్టారనీ, అయినా ఆయన చలించలేదనీ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ముందు ఆయనను అరెస్టు చేశారని.. సాక్షుల్ని ప్రభావితం చేస్తారని అందుకే అరెస్టు చేస్తున్నామనీ సీబీఐ చెప్పిందనీ తెలిపారు. వారు అరెస్టు చేసింది సాక్షులను ప్రభావితం చేస్తారని కాదనీ.. ప్రజల్ని ప్రభావితం చేస్తారనీ  కాంగ్రెస్ టీడీపీలు భయపడి అరెస్టు చేయించాయని ప్రజల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. అన్ని సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాని విజయమ్మ ఆరోపించారు. బెయిలు వస్తుందని మనం పూజలు చేస్తుంటే , తెలుగుదేశం నేతలు చిదంబరాన్ని కలసి సాక్షి ఆస్తులు జప్తుచేయమని కోరారనీ, నాలుగు గంటలు గడవకుండానే ఆ ఉత్తర్వు వెలువడడమే దీనికి నిదర్శనమనీ తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇమ్మని చెల్లెలు షర్మిలను మీ వద్దకు పంపారని చెప్పారు. ప్రస్తుతం  రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. సర్చార్జిల పేరుతో ప్రజలపై భారం పెంచుతున్నారన్నారు. 'గ్యాస్ ధర పెంచారు, సబ్సిడీ ఎత్తేశారు. ఆరోజు వైయస్ ప్రభుత్వం ఆడపడుచులపై భారం పడకూడదని సబ్సిడీ భరించారు.' అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని స్పష్టంచేశారు. చంద్రబాబులా నగదు ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెబుతోందన్నారు. 'త్వరలో జగన్ బయటకొస్తారు. వైయస్ఆర్ స్వర్ణయుగాన్ని తెస్తారు. అన్నీ నెరవేరుస్తారని' విజయమ్మ ప్రజలకు భరోసా ఇచ్చారు

Back to Top