రాజాపై ఎస్సై దౌర్జన్యం..వైయస్సార్సీపీ ఆందోళన

రాజమండ్రి : వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రాపురం ఎస్సై నాగరాజు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రోడ్డుపక్కన కారును ఆపారని, దానిని వెంటనే తీసేయాలంటూ వచ్చిన  ఎస్సై నాగరాజు దారుణంగా, దురుసుగా వ్యవహరిస్తూ  పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో నెలల పసికందు ఉన్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుడా  తమదైన పోలీసు మార్కు జులుంను ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, వైయస్ఆర్ సీపీ నాయకులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు తదితరులు రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. జక్కంపూడి రాజాను కొట్టిన ఎస్సైను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రామచంద్రాపురంలో వైయస్సార్సీపీ బంద్ చేపట్టింది. రాజాపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై నాగరాజును  సస్పెండ్ చేయాలని పార్జీ జిల్లా అధ్యక్షులు కె.కన్నబాబు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top