'పశ్చిమ' ప్రజలకు బాలరాజు కృతజ్ఞతలు

కొవ్వూరు (ప.గో.జిల్లా) :

పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీమతి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఘన విజయం చేసిన ప్రజలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,‌ వైయస్ అభిమానులకు ‌పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.‌ ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 24 రోజుల పాటు 13 నియోజకవర్గాల మీదుగా కొనసాగిన శ్రీమతి షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికి, రాజన్న కూతురుని జిల్లా ప్రజలు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని ఆ ప్రకటనలో బాలరాజు ధన్యవాదాలు అన్నారు.

చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించిన నాటి నుంచి, కొవ్వూరు వద్ద వీడ్కోలు పలికే వరకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకొన్నారని తెలిపారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ కుటుంబానికి జరుగు‌తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీమతి షర్మిలకు అండగా నిలిచారన్నారు. డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను, పథకాలను అమలు చేయగల సత్తా ఒక్క శ్రీ జగన్మోహన్‌రెడ్డికే ఉందని బాలరాజు అన్నారు.

Back to Top