ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా పార్టీ ప్రణాళిక

హైదరాబాద్ః ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని, పాదయాత్ర జరిగే తీరును బట్టి 2019 ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో తయారవుతుందని వైయస్సార్సీపీ నేతలు తెలిపారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైయస్ జగన్ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...180 రోజుల పాటు 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3వేల కి.మీకుపైగా వైయస్ జగన్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.  మిగిలిన 50 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపడుతారని తెలిపారు. దాదాపు 5వేలకు పైగా దారి వెంబడి సమావేశాలు. పార్టీ కార్యకర్తల సమావేశాలు. ప్రభావిత సంఘాలతో 180 సమావేశాలు...125భారీ బహిరంగసభలు...జెండా, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు. 20వేలకు పైగా పార్టీ కార్యకర్తలు... 2కోట్ల మందికిపైగా ప్రజలతో వైయస్ జగన్ మమేకమవుతారని  పేర్కొన్నారు.  వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయాల్లో ఆయా నియోజకవర్గ కో ఆర్డినేటర్స్, శాసనసభ్యులు నాలుగుమాసాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారని, ఆతర్వాత మరో రెండు నెలల్లో చేయబోయే కార్యక్రమాల గురించి వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మరిన్ని విషయాలు వెల్లడించారు. అవేమింటంటే...

పాదయాత్ర ముఖ్యాంశాలుః 
1)ప్రత్యేకహోదా కోరుతూ సంతకాల సేకరణః 
ప్రత్యేక హోదా ఏపీ హక్కు. విభజన సమయంలో మనకు పార్లమెంట్ లో ఆనాటి ప్రధాని వాగ్ధానం చేశారు. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. తీసుకురావాల్సిన బాధ్యత బాబుపై ఉన్నా తన స్వార్థం కోసం హోదాకు బదులు ప్యాకేజీకి మోకరిల్లాడు. హోదా వచ్చి ఉంటే ఈపాటికే పారిశ్రామికంగా రాష్ట్రాభివృద్ధి వేగంగా జరిగేది. రాష్ట్రం బాగుపడేది. పొరుగురాష్ట్రాలతో సమానంగా వెళ్లేవాళ్లం. రాష్ట్రానికి బాబు తీరని ద్రోహం చేశాడు. మన హక్కును సాధించుకోవాలి.
2) కీలక సామాజిక వర్గాల ముఖ్య నేతలతో సమావేశం
3)బూతు కమిటీలను బలపర్చడంః బూత్ కమిటీలు పార్టీకి కీలకం. వీటిని మరింతగా బలపర్చుకోవాల్సిన అవసరం ఉంది. 
4)నాలుగు మాసాలపాటు రచ్చబండ కార్యక్రమంః
 కనీసం 30 కీలక గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, కో ఆర్డిటనేటర్స్  ప్రజల్లోకి వెళ్లాలి.  వారి కష్టసుఖాలు తెలుసుకొని, భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాల గురించి వివరించాలి. ఎన్నికల హామీల అమలుపై ప్రజలతో చర్చించాలి.
రచ్చబండలో ఆయా నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందాలి. ఎన్నికలెప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. ప్రజల 
వైయస్ జగన్ 6నెలల పాదయాత్రకు ముందే నాలుగు మాసాల్లో రచ్చబండ పూర్తి చేయాలి. మిగిలిన 2 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చెబుతారు.
5)పల్లె నిద్రః 
శాసనసభ్యులు, కో ఆర్డినేటర్స్ పల్లెల్లోనే నిద్ర చేయాలి. అక్కడ ప్రజలతో మమేకం కావాలి. ఇనిస్టిట్యూషన్స్ లో విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలి. నెలకు రెండు కళాశాలలు తప్పనిసరిగా సందర్శించాలి. హోదా ప్రయోజనాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టాలి. బాబు అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు తెలియజేయాలి. బాబు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోవడమే గాకుండా నెరవేర్చినట్టు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. పల్లెల్లో ప్రజల అవసరాలు తెలుసుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల ప్రణాళిక తయారు చేసేందుకు ఇవన్నీ ఎంతో అవసరం.  ప్రజల అవసరాలు, వారి ఉద్దేశ్యం తెలియకుండా ఆఫీసులో, ఇంటిలో కూర్చొని ఎన్నికల ప్రణాళిక తయారుచేయడం గాకుండా...వారి కోరిక, ఆశయాల మేరకు ఎన్నికల ప్రణాళిక తయారుచేయాలి. 
పూర్తి సమాచారం ప్రజల దగ్గర్నుంచి సేకరించాలి. అందుకే అధ్యక్షులు దీనికి ప్రజాసంకల్ప యాత్రగా నామకరణం చేశారు. బలహీన వర్గాల కాలనీల్లో పల్లెనిద్ర చేస్తే సమస్యలు ఎక్కువగా తెలుస్తాయి. 
Back to Top