పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయమ్మ పుట్టినరోజు వేడుకలు

గాంధీనగర్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధా కృష్ణ సమక్షంలో కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ పుణ్యశీల కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అక్క డనుంచి పాదయాత్రగా వెళ్లిగా న్యూ ఇండియా హోటల్‌ సెంటర్‌లో చలివేంద్రం ప్రారంభించారు. చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, సెంట్రల్‌నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్‌బుల్లా విజయ్‌కుమార్, పార్టీ అధికారప్రతిని«ధులు అవుతు శ్రీనివాసరెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వరరావు, తంగిరాల రామిరెడ్డి, సరగడ శ్రీనివాసరెడ్డి, అడపా శేషు, మనోజ్‌కొఠారి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, షేక్‌మహబూబ్, వేదాంతం చైతన్య, బోను రాజేష్, అంజిరెడ్డి. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.
 
Back to Top