పంటలు ఎండుతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా?

హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతుంటే టీడీపీ ప్రభుత్వానికి పట్టదా అని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ ఏడాది దేశంలో, పక్క రాష్ట్రం తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని, అయితే ఏపీలో మాత్రం గణనీయంగా తగ్గిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలోనే 10 మంత్రులు మకాం వేశారని, వీరికి ఆ నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలను చూసేందుకు సమయం లేదా అని నాగిరెడ్డి నిలదీశారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.

Back to Top