తెలంగాణ యువజన విభాగంలో నూతన నియామకాలు

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ యువజన విభాగంలో వివిధ నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా బూర సుమన్‌ గౌడ్, ఇ.సురేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా సి.రాజేందర్, ఇ.హరీశ్, మంచిర్యాల జిల్లా యువజన అధ్యక్షుడిగా వి.కిరణ్‌ ప్రకాశ్‌ నియమితులయ్యారు. వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్‌ ఈ నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Back to Top