నాడు మామకు నేడు ప్రజలకు వెన్నుపోటు

జూలూరుపాడు, 03 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం రాత్రి  జూలురుపాడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అండతోనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  విర్రవీగుతున్నారని ఆమె విమర్శించారు.  చంద్రబాబు నాయకుడు కాదనీ, దుర్మార్గుడని  అనాలనీ  శ్రీమతి  షర్మిల తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆనాడు మామను వెన్నుపోటు పొడిచిన బాబు నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అన్ని ఛార్జీలు పెంచుతూ కిరణ్ సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గాలను బయటపెడతారనే తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపారని  చెప్పారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మహానేత ఎంతో కృషి చేశారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. మహానేత ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తున్నారని ఆమె ఆరోపించారు. జగనన్న ముఖ్యమంత్రయ్యాక రాజన్న రాజ్యం స్థాపిస్తారని ఆమె భరోసా ఇచ్చారు.

Back to Top