ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిన ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని తుంగలో తొక్కిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ పార్టీలకతీతంగా ఎంపీలందరికీ రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఒక్కో ఎమ్మెల్యేకి రూ.3 కోట్లు కేటాయించారని చెప్పారు. ప్రజలను టీడీపీ ప్రభుత్వం అవమానిస్తోందని ఎమ్మెలే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదని ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్యే నారాయణస్వామి ఫైరయ్యారు. ఇతర పార్టీల వారిని కొనుగోలు చేస్తున్న బాబు తీరును ప్రజలంతా గమనిస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.