వైయస్‌ జగన్‌ సీఎం కావాలని పాదయాత్ర

13 రోజుల పాటు రోజుకు 30 కిలోమీటర్లు
3న తిరుపతి చేరనున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర
గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల పాటు తిరుమల వరకు ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ రోజు పట్టణం నుంచి బయల్దేరిన పాదయాత్ర ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డుకు చేరుకుంటుంది. 22వ తేదీన సంతమాగులూరు నుంచి బయల్దేరి సింగరకొండలో బస చేస్తారు. 23న అక్కడ నుంచి బయల్దేరి గుడ్లాపల్లిలో రాత్రికి బసచేస్తారు. 24న ఒంగోలు చేరుకుని అక్కడ రాత్రికి బస చేస్తారు. 25న ఒంగోలు నుంచి టంగుటూరు గుండా సింగరాయకొండ వెళ్లి అక్కడ బస చేస్తారు. 26న కావలికి చేరుకొని అక్కడ బస చేస్తారు. 27 ఉదయం అక్కడ నుంచి బయల్దేరి కొండ్రగుంట ఇంజినీరింగ్‌ కాలేజీలో బస చేస్తారు. 28న కొండ్రగుంట, 29న నెల్లూరు, 30న నాయుడుపేట, 31న సంగనమల, 1న ఏర్పేడు, 2న ఏర్పేడు నుంచి తిరుపతికి పాదయాత్ర చేరుకుంటుంది. 3వ తేదీన తిరుపతి నుంచి అలిపిరి మీదుగా మెట్ల మార్గాన తిరుమలకు చేరుకుంటుంది. 
Back to Top