న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తన గళాన్ని బలంగా వినిపించింది. ఈమేరకు లోక్ సభలో పార్టీ ఒక వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశారు. విభజనతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయిందని, ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు లోటు బడ్జెట్ ఉందని, రాజదాని కూడా లేదని ఆయన సభ దృష్టికి తీసుకొని వచ్చారు.<br/>