మహానేత విగ్రహానికి మాదాపూర్‌లో పాలాభిషేకం

హైదరాబాద్, 9 ఏప్రిల్‌ 2013: విద్యుత్ సమస్యలపై‌ మంగళవారం ‌ఆందోళన నిర్వహించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకుడు ముక్కా రూపానందరెడ్డి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్ద‌న్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనే ముందు వారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మహానేత వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ‌వారు ఈ సందర్భంగా ఆరోపించారు.
Back to Top