కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలో ఉన్న 47 రెవెన్యూ గ్రామాల్లో గత నెలలో గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ అధికారులు గుర్తించిన 323 మంది కౌలు రైతులకు ఈ (ఖరీఫ్‌ సీజన్‌) ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకు రుణాలు ఇవ్వాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు లోచర్ల మల్లేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రైతు ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసం ఏదైన చేస్తామని వేదికలపై పదేపదే చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జిల్లాలో ఎంత మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చారో బహిరంగంగా చెప్పాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా మండలంలో ఒక్క కౌలు రైతుకు రుణం ఇవ్వలేని దుస్థితిలో మన పాలకులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డలు ఇస్తున్నారే తప్ప అంతకంటే ఒరిగేది ఏమీ లేదన్నారు. వ్యవసాయ పెట్టు బడులు కోసం తాహతకు మించిన వడ్డీలకు అప్పులు చేసుకునే దుస్థితిలో కౌలు రైతులు ఉన్నాని అన్నారు. పాలకులు, జిల్లా అధికారులు స్పందించి కౌలు రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లను ఒప్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వినర్‌ కిలారి త్రినా«ద్, నాయకులు పెనుమజ్జి విష్ణు, ఎర్ర జనార్థన, కొల్ల కృష్ణ, గుజ్జల యోగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Back to Top