క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ

హైదరాబాద్:

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్రంలోని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఆమె పేర్కొన్నారు. సర్వత్రా అశాంతి నిండిన ప్రస్తుత పరిస్థితులలో క్రీస్తు ప్రవచనాలు మనకు దారి చూపుతాయనీ, శాంతియుత సహజీవనమే క్రిస్మస్ మనకిచ్చే దివ్య సందేశమనీ శ్రీమతి విజయమ్మ తెలిపారు. ప్రజలంతా సంయమనంతో కలిసిమెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడు సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని ఆమె ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

Back to Top