కొండేడు నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర

మహబూబ్నగర్ :

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కొండేడు నుంచి ప్రారంభమైంది.  దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల  చేపట్టిన యాత్ర శుక్రవారం 51వ రోజుకు చేరింది. కొండేడు నుంచి చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్‌ క్రాస్‌ రోడ్‌ మీదుగా కేసం పేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కేసంపేటలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ దాదాపు 19 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది.

Back to Top