వైయస్సార్‌పీపీ నాయకుడిని పరామర్శించిన కాటసాని

బనగానపల్లె రూరల్ః పట్టణంలోని బీసీ గోపాల్‌నగర్‌లో ఉన్న పట్టణ వైయస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షులు అనిల్‌ను నియోజకవర్గ వైయస్సాఆర్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం పరామర్శించారు. అనిల్‌ గత కొందిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు.దీంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనిల్‌ ఇంటి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని ఆడిగి తెలుసుకున్నారు.అవసరమైతే కర్నూలులో మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్‌రెడ్డి,అల్లివుశేన్‌ తదితరులు ఉన్నారు.

Back to Top