స‌భా హ‌క్కుల తీర్మానంలో సాంప్ర‌దాయం ఏది..!

అసెంబ్లీ లో స‌భా హ‌క్కుల తీర్మానం ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు పాటించాల్సిన నిబంద‌న‌ల్ని పాటించ‌లేదని ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ లేవ‌నెత్తారు. ఇటువంటి సంద‌ర్భాల్లో పాటించాల్సిన విధి విధానాల్ని ఆయ‌న చ‌దివి వినిపించారు. డాక్యుమెంట్‌, ఆధారాలు స‌మ‌ర్పించ‌టం, వీటిపై విచార‌ణ జ‌రిపించ‌టం వంటి విధానాలు ఎక్క‌డ ఉన్నాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై స‌భా వ్య‌వ‌హారాల మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ..స్పీక‌ర్ కు ఉన్న అధికారాల్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కాకాని.. స్పీక‌ర్ అధికారాల్ని తాము కాద‌న‌టం లేద‌ని, కానీ సాంప్ర‌దాయాల్ని పాటించ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌టాన్ని ప్ర‌శ్నిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై స్పీక‌ర్ రూలింగ్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

Back to Top