ఎమ్మెల్యే కాకాణి పరామర్శ

మనుబోలు:  మండలంలోని అక్కంపేట గ్రామంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిని బుధవారం ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పరామర్శించారు. కిడ్పీ వ్యాధితో బాధపడుతున్న ఓజిలి శ్రీనివాసులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్యతో ఇటీవలే మృతి చెందిన పూండ్ల రామసుబ్బమ్మ కుటుంబ సభ్యులు రామ్మోహన్రెడ్డి, శంకర్రెడ్డి, రామిరెడ్డిలను పరామర్శించారు. వారికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించే శ్రీనివాసులు రెండు కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టడంతో తమ కుటుంబం వీదిన పడిందని కుటుంబ సభ్యులు కాకాణి వద్ద వాపోయారు. అన్ని విదాలా ఆదుకుంటామని ఎంఎల్ఏ వారికి హామీ ఇచ్చారు. కీళ్ల వ్యాధితో బాధపడుతున్న ఇనమడుగు రవీందర్రెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్రెడ్డి, చిట్టమూరు అజయ్రెడ్డి, గౌతమ్ తదితరులున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top