కాంగ్రెస్‌, టిడిపి కుట్రలు ఎంతోకాలం కొనసాగవు

శ్రీకాకుళం : కాంగ్రెస్‌, టిడిపిల కుట్రలు ఎంతో కాలం కొనసాగబోవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా, ఉద్యోగ వర్గాలతో పాటు అందరి మద్దతు ఉందని కృష్ణదాస్‌ పేర్కొన్నారు. జిల్లాలోని జలుమూరు మండలం చల్లవానిపేట జంక్షన్‌లో బుధవారం ‌నిర్వహించిన ‘జగన్ కోసం... జనం సంతకం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సిబిఐ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశాయని ఆరోపించారు. అయితే, శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా త్వరలోనే బయటకు వస్తారన్నారు.

పేదల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు చేపట్టారని, అయితే, ‌ప్రస్తుత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కుతోందని కృష్ణదాస్ విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పింఛన్లు, ఫీజు రీయింబ‌ర్సుమెంట్ అందక ప్రజలు అవ‌స్థలు పడుతున్నారన్నారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటడంతో ‌సామాన్యుడి బతుకు దుర్భరమైందన్నారు. టిడిపి మునిగిపోతున్న నావ అని, కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆ పార్టీ నాయకులకే తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Back to Top