జల్లికుమ్మరనుంచి పాదయాత్ర ప్రారంభం!

ఉంగుటూరు, 23 మే 2013:

దివంగత
మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్
జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా
ప్రస్థానం పాదయాత్ర గురువారం నాటికి 157వ రోజుకు చేరింది. గురువారం ఉదయం
ఆమె ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని జల్లికుమ్మర నుంచి పాదయాత్రను
ప్రారంభించారు. వెలగపల్లి, వరదరాజపురం, గొల్లలదిబ్బ, గణపవరం, సారిపల్లి,
ఆరేడు మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగనుందని పార్టీ రాష్ట్ర
కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు
తెలిపారు. గురువారం నాడు ఆమె 11.2 కిలోమీటర్లు నడుస్తారని చెప్పారు.

Back to Top